Friday, 19 June 2026 08:21:05 AM
# హిందువుల ఇండ్లకు నిప్పు.. 5 ఇండ్లను తగులబెట్టిన దుండగులు ! # పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలి : హరీశ్రావు # భారీ సెంచరీతో విజృంభించిన జురెల్.. బరోడాపై యూపీ ఘన విజయం # ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే # వరల్డ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో తెలంగాణ కుర్రాడి హవా.. మాగ్నస్ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌పై అర్జున్‌ థ్రిల్లింగ్ విక్టరీ # హైదరాబాద్‎కు ఏమైంది..? విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా‌‌‌ మూడో ఓటమి # నగరాల్లో కోతులు.. కుక్కల బెడద!..ఏడాదిలో 1.31 లక్షల కుక్క కాటు కేసులు # అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం..పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ # వీధి కుక్కల బీభత్సం..అత్తాపూర్లో మూడేండ్ల చిన్నారిపై దాడి # బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీని ముట్టడిస్తం # మామునూర్‍ ఎయిర్ పోర్ట్ భూములను పరిశీలించిన ఏఏఐ ఆఫీసర్లు # ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్లోలో.. ‘ది రాజా సాబ్’ కథేంటో చెప్పేసిన ప్రభాస్ # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 19-12-2025 | Today News Paper # మతాలకు అతీతంగా డా.బరిగెల శివ నివాసంలో II JAI BHEEM TV INDIA # తెలంగాణలో నెం.1 కాంగ్రెస్ - ఇది హెచ్చరికేనా II JAI BHEEM TV INDIA # మజాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - మరి మిగిలినవారి పరిస్థితి II JAI BHEEM TV INDIA # ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర II JAI BHEEM TV INDIA # అదిలాబాద్ జిల్లాలో మొదటి సారి ఒటు వేసిన వృధుడు II JAI BHEEM TV INDIA # 29 లక్షల కొత్త ఉచిత విద్యుత్ కనెక్షన్లు II JAI BHEEM TV INDIA # LIVE : Good Morning Telangana With Journalist Dr. Barigela Shiva | 18-12-2025 | Today News Paper

ఐబొమ్మ రవికి బిగ్ షాక్..!!

మరోసారి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్

Date : 16 December 2025 07:50 PM Views : 313

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్: ఐబొమ్మ వెబ్‎సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టు మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు కేసుల్లో మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఒక్కో కేసులో నాలుగు రోజులు విచారించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో 2025, డిసెంబర్ 18 నుంచి రవిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కాగా, చిత్ర పరిశ్రమకు పెను సవాలుగా మారిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‎పల్లిలో అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. అనంతరం కోర్టు అనుమతితో రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. పోలీసుల విచారణలో రవి తన దందాను కేవలం పైరసీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కాకుండా.. అనేక అక్రమ కార్యకలాపాలు నిర్వహించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీని వెనుక అంతర్జాతీయ లింకులు కూడా ఉన్నాయని తేలింది. రవి ఐబొమ్మతో పాటు 'బప్పం' (bappam.TV) పేరు మీద 17 ప్రధాన వెబ్‌సైట్‌లు, 65కు పైగా మిర్రర్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ పైరసీ సామ్రాజ్యం ఎంత విస్తరించిందంటే.. ప్రతి నెలా సుమారు 3.7 మిలియన్ల యూజర్లు ఈ సైట్‌లలో లాగిన్ అవుతున్నారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించుకుని.. రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్‌లకు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు తేల్చారు. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన మరిన్నీ వివరాలు రాబట్టేందుకు రవిని మరోసారి పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా చెంచల్ గూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని మరిన్నీ వివరాలు రాబట్టనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: